హవ్వ…’మురుగదాస్’అలాంటి వాడా??

మురుగుదాస్…తమిళంలో మంచి కధా రచయితగా తన ప్రస్థానాన్ని ఆరంభించిన ఈ రచయిత….ఎంతో మంది తమిళ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు…ఇక అజిత్ హీరోగా తన తొలి సినిమాను తీసిన ఈ దర్శకుడు…అది కాస్త ఫ్లాప్ కావడంతో కరియర్ ఏమయిపోతుందో అని కాస్త ఇబ్బంది పడ్డాడు..అయితే టాలెంట్ ఉన్నాడికి ఎప్పటికైనా లైఫ్ ఉంటుంది అని తమిళంలో రమణ అనే సినిమాని తీశాడు అదే తెలుగులో మన మెగాస్టార్ నటించిన ఠాగూర్…ఇక ఆ సినిమా హిట్ కావడంతో వెనువెంటనే సూర్యతో గజినీ తెరకెక్కించాడు…కట్ చేస్తే అది కూడా సూపర్ హిట్ అవడంతో బడా దర్శకుడిగా మారిపోయాడు.

ఇదిలా ఉంటే తాజాగా మన ప్రిన్స్ తో 100కోట్ల ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న ఈ దర్శకుడిపై కొన్ని షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది…..ఇప్పుడు సోషల్ మీడియాలో మురుగదాస్ కి సంబంధించి ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో మందు తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది. అదే క్రమంలో గతంలో ఒక మహిళ తనతో మురుగదాస్ మిస్ బిహేవ్ చేసాడని కంప్లైంట్ కూడా  చేసినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు తో తెలుగు , తమిళ చిత్రం చేస్తున్న మురుగుదాస్…ఇలా చేయడం ఏంటి ? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనిపై స్పందించిన మురుగదాస్ అసలు ఆ వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని కావాలనే తనపై కొందరు ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకుంటున్నారని ఆయన తెలిపాడు. ఈ విషయంపై తాను పోలీసులను కూడా ఆశ్రయించనున్నట్టు తాను పేర్కొన్నాడు. చూద్దాం మరి ఈ మ్యాటర్ ఎంతవరకూ వెళుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus