టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూత!

  • May 22, 2023 / 10:29 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కోటి సంగీత ద్వయానికి ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు. ఈ కాంబినేషన్ లో వచ్చిన పాటలలో వందల సంఖ్యలో పాటలు హిట్ అయ్యాయి. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రాజ్(68) ఈరోజు తుదిశ్వాస విడిచారు. హార్ట్ ఎటాక్ తో కూకట్ పల్లిలోని తన నివాసంలో రాజ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా రాజ్ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్టు సమాచారం.

మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ప్రళయ గర్జన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కోటి ద్వయం కెరీర్ మొదలైంది. యముడికి మొగుడు సినిమాతో రాజ్ కోటి ద్వయానికి మంచి పేరు వచ్చింది. రాజ్ మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. రాజ్ మరణం సంగీత ప్రియులకు తీరని లోటు అని చెప్పాలి.

సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రాజ్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. రాజ్ కోటి మ్యూజిక్ ఇచ్చిన అన్న తమ్ముడు, హలో బ్రదర్, బంగారు బుల్లోడు, బాల గోపాలుడు, ముఠామేస్త్రి, లంకేశ్వరుడు సినిమాలు మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి. 150 కంటే ఎక్కువ సినిమాలకు రాజ్ కోటి కలిసి పని చేశారు. రాజ్ కోటి వరుసగా ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే వీళ్లిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.

తర్వాత రోజుల్లో రాజ్ కోటి విడివిడిగా సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్స్ లో నటించి రాజ్ మెప్పించారు. మహేష్ హీరోగా తెరకెక్కిన టక్కరి దొంగ సినిమాలో రాజ్ కామెడీ రోల్ లో నటించి మెప్పించారు. సిసింద్రీ, రాముడొచ్చాడు, చిన్నిచిన్ని ఆశ సినిమాలకు రాజ్ సోలోగా మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. ప్రేమంటే ఇదేరా సినిమాకు నేపథ్య సంగీతం అందించారు. రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags