నా అందాలు…నా ఇష్టం అంటున్న రేష్మీ!!!

  • September 14, 2016 / 12:34 PM IST

సినిమా ప్రపంచం అంటేనే అందాల ప్రపంచం అని అర్ధం…అయితే అలాంటి ప్రపంచంలో విహరించి..టాప్ ప్లేస్ లో నిలబడాలి అంటే ఖచ్చితంగా అందాల ఆరబోతకి సై ఆనాల్సిందే….అందులో హీరోయిన్స్, ఐటమ్ సాంగ్ డ్యాన్సర్స్ అయితే ఖచ్చితంగా తమ అందాలనూ ఆరబోయాల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా బిల్లి తెరపై తన హవాను కొనసాగిస్తూ….తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఇప్పుడిప్పుడే సినిమా బిజీ అవుతున్న హాట్ హీరోయిన్ రేష్మి. ఈ భామ బుల్లి తెరకు రాక ముందు ఒకటి అర…సినిమాలు చేసింది కానీ, పెద్దగా కలసి రాకపోవడంతో డ్రాప్ అయిపోయింది.

ఇదిలా ఉంటే తాజాగా మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడానికి రెడీ అవుతున్న రేష్మి…తొలి సినిమా గుంటూర్ టాకీస్ తో మంచి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక సినిమా విషయంలో అందాల ఆరబోతకు రెడీ అయిన రేష్మికి మీడియా వాళ్ళు “అందాల ఆరబోత” గురించి అడగగా….కాస్త గట్టిగా సమాధానం ఇస్తూ….సినిమాలంటేనే గ్లామర్ ప్రపంచం, మరీ, ఆ గ్లామర్ ప్రపంచంలో ‘నాకున్న అందాన్ని చూపిస్తే తప్పేంటి?’ అని అంటూనే…తన అందాలను తెరపై చూపించే విషయంలో తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవంటోంది.

అంతేకాకుండా హీరోయిన్లను అందంగా చూపిస్తేనే థియేటర్ కు ప్రేక్షకులు వస్తారని గట్టిగా నొక్కి మరీ చెబుతుంది…. హీరోయిన్ ను అందంగా చూపించడం లేదా కనిపించడం తప్పంటే తాను ఒప్పుకోనని తెగేసి చెబుతోంది. అయితే, కొందరు దీనిని మిస్ యూజ్ చేస్తున్నారని అంటోంది. అందానికి, అసభ్యతకీమధ్య ఉన్న తేడా ఒక చిన్నగీత మాత్రమేనని రేష్మీ తన మనసులో మాట చెప్పింది. ఏది ఏమైనా…రేష్మి అందాల ఆరబోతపై ఫుల్ క్ల్యారిటీతో ఉండడం చూస్తుంటే….మున్ముందు మనకు అందాల జాతర తప్పేలా లేదు అనిపిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus