Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలి.. అదే నా ఫిలాసఫీ: మాసూద నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా

ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలి.. అదే నా ఫిలాసఫీ: మాసూద నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా

  • December 9, 2022 / 07:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలి.. అదే నా ఫిలాసఫీ: మాసూద నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, హర్రర్ డ్రామా ‘మసూద’ వంటి విభిన్న కథలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీడియా సమావేశం నిర్వహించారు. నిజాయితీతో, క్రమశిక్షణతో ఏ పని చేసినా.. విజయం ఖచ్చితంగా వస్తుందనే దానికి ఉదాహరణే స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నుంచి వచ్చే చిత్రాలని ఆయన చెబుతున్నారు. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనేదే తన ఫిలాసఫీ అంటున్న ఈ యంగ్ నిర్మాత.. ఈ 5 సంవత్సరాలలో తను అనుకున్నదానికంటే కూడా ఎక్కువే సాధించానని తెలుపుతూ.., అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమావేశంలో రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ..
– ‘మసూద’ సినిమా విజయం సాధించినందుకు, అందరి నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
– హ్యాట్రిక్ అనిగానీ, నెంబర్స్ గురించిగానీ అస్సలు ఆలోచించలేదు. మంచి స్టోరీ. జెన్యూన్‌గా, హానెస్ట్‌గా, క్రమశిక్షణతో సినిమా తీస్తే.. జనాలకు నచ్చుతుంది. డబ్బులు కూడా వస్తాయని నమ్మాను. మొదటి సినిమా ‘మళ్లీరావా’ నుంచి ఇదే నమ్ముతున్నాను.

– తెలియని క్యాస్ట్ ఉంటే చిన్న సినిమాల కేటగిరిలో పెట్టేస్తారు. రెమ్యూనరేషన్స్‌కి హై బడ్జెట్ పెట్టి.. పెద్ద సినిమా అంటే, టెక్నికల్‌గా ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు చిన్న సినిమాలు ఎందుకు అవుతాయి? పెద్ద సినిమా ఎందుకు కాదు? పెద్ద హీరోలు చేసే సినిమాలకు టెక్నికల్‌గా ఈ సినిమా ఆ లెవల్‌లో ఉంది. నేను క్యాస్టింగ్‌కి బడ్జెట్ పెట్టడం లేదు.. వాళ్లు పెడుతున్నారు అంతే.

– ‘మసూద’ ఫస్ట్ డే తక్కువ థియేటర్లలోనే విడుదలైంది. ఆ తర్వాత వచ్చిన టాక్‌తో రోజురోజుకు థియేటర్లు పెరిగాయి. నా ఫస్ట్ సినిమా నుంచి శుక్రవారం సినిమా విడుదలైతే.. శనివారం నుంచే థియేటర్లు పెరుగుతూ వచ్చాయి.

– స్టార్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ ఎంత చేస్తే అంత జనాల్లోకి ఆ సినిమా వెళుతుంది. మొదటి నుంచి సినిమాపై అంచనాలు ఉంటాయి కాబట్టి.. థియేటర్లకి ప్రేక్షకులు వస్తారు. కానీ ‘మసూద’ వంటి సినిమాలకు.. సినిమా బాగుంటే తప్పితే.. విడుదలకు ముందు ఎంత ప్రమోట్ చేసినా జనాలు పట్టించుకోరు. నేను సినిమా తీసే విధానంలో ఎంత జాగ్రత్త పడతానో.. ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను.

– సినిమా లెంగ్త్ విషయానికి వస్తే.. అంతా ఫాస్ట్ పేసేడ్ మూవీకి అలవాటు పడిపోయాం. డ్రామాకి సెటప్, టైమ్ కావాలి. స్లో అనిపించవచ్చు కానీ.. నేను ఆ ప్లేస్ తీసుకుని.. గోపీ పాత్రని అలా చూపించకపోతే.. గోపీ పాత్రకు సెకండాఫ్‌లో అర్థమే ఉండదు. గోపీ ఎంత భయస్తుడో చెప్పకుండా.. సెకండాఫ్ చూపిస్తే సీన్ పండదు. ఫస్టాఫ్ అతను భయస్తుడు అని చూపిస్తేనే జనాలకి నచ్చుతుంది. అదే జరిగింది.

– సెకండాఫ్‌లో సాంగ్ గురించి కూడా కొందరు మాట్లాడారు. సినిమాకి గ్రాఫ్ ఉంటుంది. అది కొన్ని చోట్ల పడిపోవాలి. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ సినిమాలకు కూడా క్లైమాక్స్‌కి ముందు గ్రాఫ్ పడిపోతుంది. ఏ సినిమాకైనా అది ఉండాలి. ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్‌తో ఒక్కసారిగా గ్రాఫ్‌ లేస్తుంది. మూవీ తీసే గైడ్‌లైన్స్‌లో అది ఖచ్చితంగా ఉంటుంది.

– నేను నేరేషన్‌కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను. ఫుల్ బౌండెడ్ స్క్రిఫ్ట్ మొత్తం చదువుతాను. కథ ఎంత డెప్త్‌గా రాసుకుంటాడో.. అంత గొప్పగా సినిమా తీయగలడని నమ్ముతాను. పూర్తి కథ చదువుతున్నప్పుడు.. ఆ కథ రాసిన పర్సనాలిటీ గురించి కూడా ఎక్కడో ఒకచోట నాకు తెలుస్తుంది.

– బై ఛాన్స్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను ఇంజనీరింగ్ చేశాను. తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత ఓన్‌గా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో రియల్ ఎస్టేట్‌లోకి వచ్చాను. చిన్న ఫార్మా ఇండస్ట్రీ కూడా రన్ చేయాలని అనుకున్నాను. అట్లాంటి టైమ్‌లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా గౌతమ్ నన్ను కలిశాడు. అతని గురించి చెప్పి.. ‘మళ్ళీరావా’ స్క్రిఫ్ట్ ఇచ్చాడు. మొత్తం చదివాను. నాకు చాలా బాగా నచ్చింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను.

– ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ట్రైలర్ రిలీజ్ వేడుకలో 5గురు కొత్త డైరెక్టర్స్‌ని పరిచయం చేయాలని ఛాలెంజ్ చేసుకున్నాను. 5 సినిమాలతోనే ఆపేయను.. ఆ తర్వాత కూడా చేస్తాను.

– ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీశాము? అని నేను ఎప్పుడు ఆలోచించను. మంచి సినిమా తీయాలి. ఆ సినిమాతోనే లాభాలు ఆర్జించాలి. ఇదే నా ఫిలాసఫీ. మొదటి సినిమా నుంచి అదే ఫాలో అవుతున్నాను.

– నేను టైమ్ ఎక్కువ తీసుకుంటాను. అలాగే నాకు వర్క్‌షాప్ కూడా చేయాలి. ఎంత ప్రూవ్‌డ్ యాక్టర్స్ అయినా.. కాంబినేషన్ సీన్స్ విషయంలో ఖచ్చితంగా వర్క్ షాప్ చేయాలి. కొత్త డైరెక్టర్స్‌తో రిస్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది అవసరం అని భావిస్తాను.

– నేను సినిమా ఇండస్ట్రీకి వెళుతున్నానని చెప్పినప్పుడు.. ఇంట్లో అందరూ క్లాస్ తీసుకున్నారు. మా నాన్నగారు కొన్ని రోజుల పాటు మాట్లాడలేదు కూడా. ఈ ఒక్కసారికి నాకు సపోర్ట్ చేయండి. ఇది చేయలేకపోతే.. మీరు ఏది చెబితే అది చేస్తాను అని చెప్పా. నా బిగ్గెస్ట్ సపోర్ట్ నా వైఫ్, పిల్లలు, మా అమ్మనాన్న, నా చెల్లెలు, ఫ్యామిలీ. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేము.

– ‘మళ్ళీరావా’ సినిమాకి మా నాన్నగారు చాలా సపోర్ట్, ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు.
– ‘మసూద’ సినిమాకు మాత్రం టెక్నికల్‌గా అద్భుతంగా తీయాలని అనుకున్నాను. ఏం జరిగినా సరే.. నేను అనుకున్నది చేశాను. ఒక పొరిగింటి వ్యక్తికి మంచి టైటిల్ ఏమీ దొరకక ‘మసూద’ అని పెట్టాం.

– ‘మసూద’ సినిమాకు సంబంధించి 200 డేస్ లొకేషన్స్‌కి స్పెండ్ చేశాం. మాములుగా అయితే ఒక హర్రర్ సినిమాకి ఒక గది చాలు. కానీ ఈ సినిమాలో బిగ్ కాన్వాస్ ఉంది. పీర్ బాబా లొకేషన్ ఒక్కటే తీసుకుంటే.. 6 డిఫరెంట్ ప్లేస్‌లలో తీశాం.
– మంచి కథ కుదిరితే.. నాని, నాగచైతన్య, శేష్, నవీన్ పోలిశెట్టి ఎవరితోనైనా సినిమా చేసే ఛాన్స్ ఉంది. కథ కుదిరిన టైమ్‌కి వారు బిజీగా ఉంటే.. వేరే హీరోతో చేయవచ్చు. అయితే తర్వాత సినిమాకు సంబంధించి.. ఇంకా ఏ కథ లాక్ చేయలేదు. నేను స్క్రిప్ట్ కూడా ఏదీ చదవలేదు.

– నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను. పర్సనల్‌గా అయితే మాత్రం చిన్నప్పటి నుంచి వెంకటేష్‌గారంటే ఇష్టం.
– డిసెంబర్ 8తో మా బ్యానర్ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ బ్యానర్‌ స్థాపించినప్పుడు అనుకున్నదానికంటే.. ఎక్కువే సాధించానని అనుకుంటున్నాను. మూడు సినిమాలు తీస్తాననిగానీ, ఆ మూడు సక్సెస్ అవుతాయనిగానీ, ముగ్గురు దర్శకులని పరిచయం చేస్తాననిగానీ, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తాననిగానీ అనుకోలేదు. కానీ ఇవన్నీ జరిగాయి. అందుకే, నేను చాలా ఎక్కువే సాధించానని చెబుతాను.

– ఒక నిర్మాతగా ఉన్నా, ప్రేక్షకుడిగా సినిమా చూడగలిగితే ఖచ్చితంగా మంచి సినిమాలే వస్తాయి.
– ఒక మంచి కథ, నాకు ఛాలెంజింగ్‌గా అనిపించాలి.. అలాంటి కథ దొరికితే వెంటనే తర్వాత చేయబోయే సినిమా అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంకా ఏ కథ చదవలేదు. స్క్రిప్ట్స్ మాత్రం 2019 నుంచి నా టేబుల్ మీదే ఉన్నాయి. దాదాపు 30 కథలు ఉన్నాయి. వాటిలో ఏదీ ఇంకా చదవలేదు.

– మా సంస్థను, మా సంస్థ నుంచి వస్తున్న సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సహకరిస్తున్న మీడియావారికి, శ్రేయోభిలాషులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Masooda
  • #rahul

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

9 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

21 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

24 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

1 day ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

1 day ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version