రాంచరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) కాంబినేషన్లో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా నుండి ఇప్పటివరకు 2 పాటలు బయటకు వచ్చాయి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చాయి. యూట్యూబ్లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాట కూడా విడుదలైంది. ఈ లిరికల్ సాంగ్ 4 నిమిషాల 40 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘నాదిరిదిన్నా నాదిరిదిన్నా’ అంటూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ పాట మొదలైంది. ‘నానా హైరానా ప్రియమైన హైరానా..
మొదలాయె నాలోన లలన నీవలన’ అంటూ వచ్చే లిరిక్స్ చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ని కలిగించాయి. రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) ఈ పాటకు లిరిక్స్ అందించారు. అవి గుర్తుండిపోయే విధంగా ఉన్నాయి.సంగీత దర్శకుడు తమన్ (SS Thaman) అందించిన ట్యూన్ కూడా ఆకట్టుకుంది. కార్తీక్, శ్రేయ ఘోషల్..లు ఈ పాటని ఆలపించడం జరిగింది. ఇద్దరూ కలిసి ఈ పాటని చాలా బాగా పాడారు అని చెప్పాలి. ముఖ్యంగా ఈ లిరికల్ సాంగ్లో చరణ్- కియారా (Kiara Advani)..ల కెమిస్ట్రీ కూడా బాగా హైలెట్ అయ్యింది.
విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. లొకేషన్స్ బాగా ఎట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. ‘గేమ్ ఛేంజర్’ నుండి వచ్చిన మొదటి 2 పాటల్లో శంకర్ మార్క్ మిస్ అయ్యాయి అనే కంప్లైంట్స్ వచ్చాయి. కానీ ఈ పాట విషయంలో అలాంటి కంప్లైంట్స్ రావు. శంకర్ మార్క్ సాంగ్స్ ఎలా ఉంటాయో.. ఈ పాట ఆ విధంగా ఉంది. మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :