Nagarjuna: నాగార్జున క్లారిటీ ఇచ్చేశారు.. అందులో నిజం లేదట..!

అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ఇటీవల చాలా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. జైనాబ్ ర‌వ్ డ్జీ అనే ముంబైకి చెందిన అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. అవి చూసిన వాళ్ళు తమ బెస్ట్ విషెస్ తెలియజేయడంతో పాటు ఏవేవో అనేసుకుంటున్నారు. అఖిల్ అన్న నాగ చైతన్య  (Naga Chaitanya)   వివాహం డిసెంబర్ 4న జరగబోతున్న నేపథ్యంలో అఖిల్ పెళ్లి కూడా అప్పుడే జరగబోతుంది అని అంతా అనుకున్నారు.

Nagarjuna

దీని పై అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. అవి కూడా వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. హడావిడిగా అఖిల్-జైనాబ్ ర‌వ్ డ్జీ ల ఎంగేజ్మెంట్ చేయడానికి కారణం వేరే ఉంది అని, నాగ చైతన్య – శోభిత (Sobhita Dhulipala)..ల పెళ్లితో కలుపుకుని అఖిల్ -జైనాబ్..ల పెళ్లి కూడా చేసేయాలని నాగార్జున (Nagarjuna)  డిసైడ్ అయ్యారని కథనాలు పుట్టుకొచ్చాయి.

తాజాగా వీటిపై నాగార్జున స్పందించి క్లారిటీ ఇచ్చారని తెలుస్తుంది. ఓ ఆంగ్ల మీడియాతో నాగార్జున ఈ విషయంపై స్పందించారని సమాచారం. ‘ప్రస్తుతం మా దృష్టంతా నాగ చైతన్య- శోభిత..ల పెళ్లి వేడుక పైనే ఉంది.అఖిల్ -జైనాబ్..ల పెళ్లి వచ్చే ఏడాది చేస్తాం’ అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.

నాగ చైతన్య- శోభిత…లు తమ పెళ్లిని సింపుల్ గా, ప్రైవేట్ మ్యారేజ్..గా చేసుకోవాలి అనుకుంటున్నారు. సో అఖిల్ పెళ్లి కూడా ఆ టైంలో చేస్తే వారు అనుకున్నట్టు కుదరదు. పైగా అఖిల్ మ్యారేజ్..ని గ్రాండ్ గా చేయాలని నాగార్జున- అమల భావిస్తున్నారట. సో ఒకేరోజు చైతన్య, అఖిల్..ల పెళ్లి అనేది వట్టి పుకారే అని అర్థం చేసుకోవచ్చు.

ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus