Naa Saami Ranga Collections: ‘నా సామి రంగ’ 15 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • January 29, 2024 / 05:25 PM IST

అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారుతూ చేసిన మూవీ ‘నా సామి రంగ’. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి క్రేజీ హీరోలు కూడా ఈ మూవీలో నటించడంతో ప్రేక్షకుల దృష్టి ఈ మూవీ పై పడింది. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ..ల కి సూపర్ రెస్పాన్స్ లభించాయి.

దీంతో అంచనాలు కూడా బాగా పెరిగాయి. జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ లభించింది. దీంతో కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ 15 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  4.95 cr
సీడెడ్  3.71 cr
ఉత్తరాంధ్ర  3.46 cr
ఈస్ట్  2.72 cr
వెస్ట్  1.39 cr
గుంటూరు  1.48 cr
కృష్ణా  1.28 cr
నెల్లూరు  0.87 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  19.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.78 cr
ఓవర్సీస్  0.62 cr
వరల్డ్ వైడ్( టోటల్)  21.26 cr (షేర్)

‘నా సామి రంగ’ (Naa Saami Ranga) సినిమాకు రూ.19.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.19.4 కోట్ల షేర్ ను రాబట్టాలి. 15 రోజులు పూర్తయ్యేసరికి రూ.21.26 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. రూ.1.86 కోట్ల లాభాలను అందించి క్లీన్ హిట్ గా నిలిచింది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus