సెప్టెంబర్ 2 న “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”..

Ad not loaded.

జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.ఈ చిత్రం నుండి విడుదల చేసిన “నిలదీస్తుందా అంటూ సాగే ఈ విరహ గీతంతో పాటు విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్బంగా

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతూ చాలా హెల్ అట్మాస్ ఫియర్ లో ఉంది.అలాగే మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పడతారు అన్నట్టుఈ మధ్య వచ్చిన సినిమాలు నిరూపించాయి. మంచి కాన్సెప్ట్ తో ప‌ల్లెటూరి నేప‌ధ్యం లో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థలో యూత్ కు కావాల్సిన వినొదాన్ని మిక్స్ చేసి తెర‌క్కించడం జరిగింది.సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న మేము డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడాము థియేటర్స్ కూడా కన్వినెంట్ గా ఉన్నాయి. అందుకే త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నాము..మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మా చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది.ఈ సినిమా లోని పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి కచ్చితంగా ఇది మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా మంచి విజ‌యాన్ని సాధిస్తుందని అన్నారు

చిత్ర నిర్మాతలు ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు మాట్లాడుతూ..ఇంతకుముందు మేము రిలీజ్ చేసిన టీజర్ కు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నటించిన పెద్దలు తనికెళ్ళ భరణి గారు ,జీవా గారితో పాటు నటించిన నటీ నటులు టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు వెంక‌ట్ వందెల మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మా చిత్రం రెగ్యులర్ స్టోరీకు భిన్నంగా వస్తున్న మా సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.రావణాసురుడికి తన భార్య మండోదరి పై ఉన్న ప్రేమ , రాముడికి సీత పై ఉన్న ప్రేమ , దశరథుడుకు తన కొడుకు మీద నమ్మకం ఇలా ప్రతి ఒక్కరిది అందమైన ప్రేమ. అలాగే భగవద్గీత, బైబిల్ ఖురాన్‌లలో అందమైన, పవిత్రమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథను “నా వెంట పడుతున్న చిన్నవాడెవడమ్మా” సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమా చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. నాకు ఇలాంటి మంచి కథకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus