అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘నాంది’ డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం నరేష్ కు మంచి విజయాన్ని అందించింది. 9 ఏళ్లుగా సరైన హిట్టుకోసం ఎదురుచూస్తున్న నరేష్ కు ఈ చిత్రం ఆ లోటుని తీర్చి.. అతన్ని ప్లాపుల నుండీ బయటపడేసింది. విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. ఇప్పటివరకూ కామెడీ హీరోగానే రాణిస్తూ వచ్చిన నరేష్.. ఈసారి కంప్లీట్ సీరియస్ రోల్ ప్లే చేసిన చిత్రమిది.
ఇక ఈ చిత్రం 8 డేస్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే :
నైజాం | 1.41 cr |
సీడెడ్ | 0.46 cr |
ఉత్తరాంధ్ర | 0.34 cr |
ఈస్ట్ | 0.28 cr |
వెస్ట్ | 0.20 cr |
గుంటూరు | 0.28 cr |
కృష్ణా | 0.30 cr |
నెల్లూరు | 0.17 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.44 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.08 cr |
ఓవర్సీస్ | 0.12 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.64 cr (షేర్) |
‘నాంది’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసింది ఈ చిత్రం. ఇక 8 రోజులు పూర్తయ్యేసరికి 3.64 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ రన్ కొనసాగిస్తుంది. అయితే నిన్న ‘చెక్’ ‘అక్షర’ వంటి చిత్రాలు విడుదలవ్వడంతో కొంత డల్ అయ్యింది.. అంతేకాకుండా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి.. ఆ ఎఫెక్ట్ కూడా ‘నాంది’ కలెక్షన్ల పై పడింది. లేకుంటే ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసేదనే చెప్పాలి.
Click Here To Read Movie Review
Most Recommended Video
చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!