సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

Advertisement

కల్కి 2898 ఏడీ’ సినిమాతో ఇండియన్‌ సినిమా ప్రపంచ వేదికల మీద మరోసారి మెరిసేలా చేసిన దర్శకుడు.. ‘మహానటి’ సినిమాతో మహానటి సావిత్రి జీవితాన్ని నేటి తరానికి అందించిన మనసైన దర్శకుడు.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో మనసుల్ని మెలిపెట్టిన దర్శకుడు.. ఇలా ఎన్ని ఇంట్రడక్షన్‌లు ఇచ్చినా సరిపోని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. అంతటి పేరు తెచ్చుకున్న నాగీ.. ఆదివారం నాడు చేసిన ఓ పని ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది.

Nag Ashwin

తెలుగు సినిమాను ఫాలో అయ్యేవారికి ఇప్పటికే వారి సోషల్‌ మీడియాలో ఆ వీడియో వచ్చే ఉంటుంది. అదే లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్టేజీ మీద మాట్లాడుతుండగా స్టేజీ కింద ఆ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలను కొంతమంది సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఓ స్టార్‌ దర్శకుడి సింపుల్‌సిటీ చూడండి అంటూ కామెంట్లు కూడా పెట్టారు. అంతలా ఏం చేశారు అని అనుకుంటున్నారా.. సింగీతం మాట్లాడుతున్నంతసేపు నాగ్‌ అశ్విన్‌ నేలపై కూర్చున్నారు మరి.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘సింగ్ గీతం’కు నాగ్ అశ్విన్ నిర్మాత. ఆ సినిమా ఈవెంట్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. అప్పుడే ఈ సింపుల్‌ సిటీ థింగ్‌ జరిగింది. మరోవైపు స్టేజీ మీద సింగీతం మాట్లాడుతూ నాగ్ అశ్విన్ సినిమాల కంటే తననే ఎక్కువగా ప్రేమిస్తాడని సింగీతం శ్రీనివాసరావు అనడం గమనార్హం. నాపై ఎంతో అభిమానం, గౌరవంతో నాతో సినిమా చేయించారు. ఇది ఆయన క్రెడిట్. ‘సింగ్ గీతం’ సినిమా మొత్తాన్ని ఆయనే వెనుక ఉండి ముందుకు తీసుకెళ్లారు అని చెప్పారు.

94 ఏళ్ల సింగీతం… మ్యూజికల్ ఫాంటసీ సినిమాగా ‘సింగ్ గీతం’ సినిమాను తెరకెక్కించారు. అనుకోని మార్గంలోకి వెళ్లిన ఓ యువకుడికి ఎదురైన సవాళ్లు, ఏంటి అనేదే సినిమా కథ. ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus