దాదాపు 5 ఏళ్ళ తరువాత.. అందులోనూ పెళ్ళయ్యాక మొదటి సారి జతకడుతున్నారు చైసామ్. ఈ అక్కినేని జంట నటించిన ‘మజిలీ’ చిత్రం ఏప్రిల్ 5 న (మరో రెండు రోజుల్లో) విడుదల కాబోతుంది. శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘షైన్ క్రియేషన్స్’ సంస్థ పై హరీష్ ,సాహు నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ అలాగే పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చూడటానికి ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా కనిపించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ చిత్రంలో నాగచైతన్య లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఇష్టం లేని పెళ్ళి చేసుకుని పెళ్ళాన్ని ఇబ్బంది పెట్టే నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది. ఇక సమంత కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే అనిపిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే.. చైతూని సమంత డామినెటే చేసినట్టు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఇక ఇదే విషయం పై చైతన్య మాట్లాడుతూ…”అవును సమంత నన్ను డామినెటే చేసింది (నవ్వుతూ). నిజంగా తను ఈ సినిమాలో నటిచడం వల్ల నాకు బాగా హెల్ఫ్ అయ్యింది. మా ఇద్దరి పాత్రలు కూడా చాలా ఇంటెన్సివ్ గా ఉంటాయి. తన పాత్ర కంటే నా పాత్ర గురించి కూడా చాలా టెన్షన్ పడింది సమంత” అంటూ చెప్పుకొచ్చాడు చైతన్య. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఏమాయ చేసావే’ ‘మనం’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.