Naga Babu: వరుణ్ తేజ్ పెళ్ళి పై కీలక అప్డేట్ ఇచ్చిన నాగబాబు..!

  • February 1, 2023 / 11:28 AM IST

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అనుకున్న వాళ్ళంతా పెళ్ళికి రెడీ అవుతున్నారు. శర్వానంద్ పెళ్ళికి రెడీ అయిపోయాడు. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక రామ్ ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. సాయి ధరమ్ తేజ్ కూడా అంతే. అడివి శేష్ అయితే ఇంకా ఏదో సాధించే వరకు చేసుకోను అంటున్నాడు. సో ఇక అందరి చూపు వరుణ్ తేజ్ పై పడింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నట్లు చాలా కాలం ప్రచారం జరిగింది.

లావణ్య త్రిపాఠి కూడా మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్ కు హాజరవుతూ ఉండేది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అయ్యేవి. వరుణ్ తేజ్ తో కలిసి లావణ్య త్రిపాఠి ‘మిస్టర్’ ‘అంతరిక్షం’ వంటి సినిమాల్లో నటించింది. వరుణ్ తేజ్ పెళ్లి గురించి డిస్కషన్ వచ్చిన ప్రతిసారి లావణ్య త్రిపాఠి ప్రస్తావన వచ్చేది. నిజానికి వరుణ్ తేజ్ పెళ్లి 2021 లో జరుగుతుందని తెలిపాడు నాగబాబు.

కానీ లేట్ అయ్యే కొద్దీ లావణ్య త్రిపాఠితో పెళ్లి వార్తలు ఎక్కువగా వచ్చేవి. వరుణ్ ఆల్రెడీ థర్టీస్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. అతని వయసు ఇప్పుడు 33 ఏళ్ళు. కాబట్టి వీలైనంత త్వరగా ఇతనికి పెళ్ళి చేయాలని నాగబాబు భావిస్తున్నాడు. ‘ఆల్రెడీ ఓ అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందని.. త్వరలోనే ఆ అమ్మాయి డీటెయిల్స్ ను వరుణ్ తేజ్ వెల్లడిస్తాడని..

పెళ్లయ్యాక భార్యతో సెపరేట్ ఉంటాడని’ నాగబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సో నాగబాబు మాటలను బట్టి.. వరుణ్ తేజ్ పెళ్లి ఈ ఏడాదే ఉండబోతుందని క్లారిటీ అయితే వచ్చేసింది. సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus