ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుండి తప్పుకోవాలని అనుకుంటున్నానని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని ఆయన ప్రకటించారు. ఈ ట్వీట్ పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో నాగబాబు కూడా స్పదిస్తూ.. ఆయన సరైన నిర్ణయం తీసుకున్నారని.. తను కూడా మోదీని ఫాలో అవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు.
దీంతో నెటిజన్లు నాగబాబుపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. ‘చాలా హ్యాపీగా ఉంది.. గుడ్ బై అన్నా’ అంటూ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఇక సోషల్ మీడియాని వదిలేస్తానని చెప్పిన మోదీ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం ఒక్కరోజే తన సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉంటానని చెప్పారు. ఆదివారం నాడు మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ తాన్ సోషల్ మీడియా అకౌంట్లను మహిళలకు అప్పగిస్తా అంటూ ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఇప్పుడు నాగబాబు తాను అన్నమాట ప్రకారం సోషల్ మీడియాని వదిలేస్తారా..? లేక కొనసాగుతారా..? అనే విషయంపై చర్చ మొదలైంది. కొందరు నెటిజన్లు నాగబాబుని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.
Most Recommended Video
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!