వైరల్ అవుతున్న ‘చైసామ్’ కొత్త ఫోటోలు..!

  • January 7, 2019 / 01:36 PM IST

ప్రస్తుతం నాగ చైతన్య – సమంత లు ‘మజిలీ’ చిత్రంలో నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తాజాగా ‘న్యూ ఇయర్’ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ‘న్యూ ఇయర్’ సందర్భంగా ‘మజిలీ’ చిత్ర షూటింగ్ కు కొంత విరామమిచ్చి న్యూ ఇయర్ వేడుకలకు నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌ కు వెళ్ళారు.

తాజాగా నెదర్లాండ్స్ లో వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత . తన జీవితంలోనే ఈ ట్రిప్ ‘ది బెస్ట్’ అంటూ సమంత సంతోషం వ్యక్తం చేస్తుంది. ‘గొప్ప అంచనాలతో 2019లోకి అడుగుపెడుతున్నాం’, ‘నువ్వు నవ్వే విధానం’, ‘2019కి సిద్ధంగా ఉన్నా’, ‘నాట్ ఎలోన్’ అంటూ ఫొటోలను సమంత షేర్ చేసింది సమంత. చలి దుస్తులు ధరించిన నాగచైతన్య-సమంతలు నవ్వుకుంటూ ఉన్న ఫోటో, అలాగే వీరిద్దరూ నడిచి వెళుతుండటం, సమంత, ఆమెతో ఉన్న వ్యక్తులు కడుపుబ్బ నవ్వుకుంటున్న దృశ్యాలతో పాటు సమంత సింగిల్ గా పోజిచ్చిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటోల్లో నాగచైతన్య, సమంతలు కొత్త లుక్ లో కనిపిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus