అక్కినేని అభిమానులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చింది. కింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, సమంత పెళ్లిని జరిపించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ ప్రేమ పక్షులు పెద్దల సమక్షంలో జనవరి 29న నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి పీటలపై కూర్చునేందుకు వారిద్దరూ కొంత గడువు కోరడంతో అప్పుడు ముహూర్తం ఫిక్స్ చేయలేదు. తాజాగా చైతూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కల్యాణ వేడుకకు పనులు మొదలెట్టారు. అక్టోబర్ ఆరవ తేదీన తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు నాగచైతన్య ఈ రోజు జరిగిన 64 వ జియో ఫిలిం ఫేర్అవార్డ్స్ సౌత్ ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. వేదికను మాత్రం వెల్లడించలేదు.
ముందు నుంచి చెబుతున్నట్లే మొదట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించనున్నారు. అనంతరం చర్చిలో మరో మారు జీసస్ ఎదుట ఉంగరాలు మార్చుకోనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య “రారండోయ్ వేడుక చూద్దాం” మూవీ విజయాన్ని ఆనందిస్తున్నారు. అంతేకాదు థ్రిల్లర్ మూవీ చేసే పనిలో ఉన్నారు. సమంత రామ్ చరణ్ తో సినిమాతో పాటు మరో ఐదు ప్రాజక్ట్ లకు సంతకం చేసింది. వీరిద్దరూ ఈ ప్రాజక్ట్ లన్నీ అక్టోబర్ నాటికీ కంప్లీట్ చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.