నాగచైతన్య కోసం ‘మహా సముద్రం’..?
- April 25, 2019 / 04:12 PM ISTByFilmy Focus
‘ఆర్.ఎక్స్ 100′ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. అయితే తన తరువాతి చిత్రం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయాలనుకున్నాడు. ఎందుకో ఆ ప్రాజెక్ట్ కూడా సెట్టవ్వలేదు. దీంతో ఎదురుచూసి.. చూసి.. ఎట్టకేలకు అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళి నాగచైతన్యకు కథ చెప్పాడు. సమంత కూడా ఈ కథ విందట. ఇద్దరికీ అజయ్ భూపతి వినిపించిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అంతేకాదు ఈ చిత్రంలో మరోసారి ఇద్దరూ కలిసి నటించబోతున్నారనే టాక్ కూడా నడుస్తుంది.’
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
‘మహా సముద్రం’ అనే టైటిల్ కూడా ఈ చిత్రం కోసం అనుకుంటున్నారట. ఇక ఈ చిత్రంలో చైతూ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ‘తఢాకా’ చిత్రంలో డూప్లికేట్ పోలీస్ గా కనిపించాడు చైతూ. తరువాత గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం క్లైమాక్స్లో కూడా కాసేపు పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఇప్పుడు పూర్తి తరహా పోలీస్ గా కనిపించడానికి రెడీ అవుతున్నాడన్న మాట. మహా అనే అమ్మాయి కథ ఇదంట . విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో జరుగుతుందని తెలుస్తుంది. ఇందు కోసమే ఈ చిత్రానికి ‘మహా సముద్రం’ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది. మాఫియా నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రంతో తెరకెక్కుతోందని… యాక్షన్ ఎలిమెంట్స్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న సీరియస్ డ్రామా అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్తానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారని సమాచారం.















