పోటీ పడనున్న నాగచైతన్య, రవితేజ చిత్రాలు

  • February 24, 2018 / 01:53 PM IST

రవితేజతో నాగచైతన్య ఫైట్ చేయనున్నారా? వారి చిత్రాల మధ్య గట్టి వార్ జరుగనుందా ? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు ఫిలిం నగర్ వాసులు. వివరాల్లోకి వెళితే.. యువ సామ్రాట్ నాగచైతన్య తనకి ప్రేమమ్ వంటి హిట్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నారు. టైటిల్ లోగో రిలీజ్ తోనే ఆసక్తి కలిగించిన ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలో మాధవన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సవ్యసాచి చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.

కార్తికేయతో ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసిన చందు.. ఈ చిత్రం ద్వారా మరింత థ్రిల్ అందించడానికి కష్టపడుతున్నారు. ఇక నాగార్జునతో “సోగ్గాడే చిన్ని నాయనా”, నాగ చైతన్యతో “రారండోయ్ వేడుక చూద్దాం” చేసి విజయాలను అందుకున్న కల్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి శ్రమిస్తున్నారు. అతను రవితేజతో “నేల టికెట్” అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీని మే 25న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి ఒక రోజు ముందుగా అంటే మే 24న “సవ్యసాచి” రిలీజ్ కానుంది. సో ఈ రెండు చిత్రాల మధ్య గట్టి పోటీ ఉండనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus