సమంత చెప్పినట్లుగానే చేసాను : నాగ చైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య సవ్యసాచి మూవీని కంప్లీట్ చేసి.. మారుతీ దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాని చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది.  ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన చైతూ వ్యక్తిగత, వృత్తిగత విషయాలను పంచుకున్నారు. సమంత నటనకు గుడ్ బై చెబుతుందని వచ్చే వార్తలను ఖండించారు. నటన అంటే ఆమెకి చాల ఇష్టమని, సినిమాలకు దూరం కాదని స్పష్టం చేశారు. అలాగే సమంతతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు చెప్పారు. “మీరిద్దరూ చేస్తే కథ వర్కవుట్‌ అవుతుంది అని శివ చెప్పారు. పెళ్లైన రెండు మూడేళ్ల తర్వాత ఓ జంట జీవితంలో ఏం జరిగిందనేది కథ. తొలి సన్నివేశంలోనే పెళ్లైనట్లు చూపిస్తారు. ప్రేక్షకులకు, మాకు అది కొంచెం కనెక్ట్‌ అవుతుంది.

ఇప్పుడు మళ్లీ మా ఇద్దరి మధ్య ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ అంటే ఎవరు నమ్ముతారు” అంటూ నవ్వేశారు. ఇంకా మాట్లాడుతూ “కె.ఎస్‌. రవీంద్ర (బాబి) దర్శకత్వంలో మావయ్య వెంకటేశ్‌తో కలిసి నటించబోయే సినిమాలో ఆయనకు మేనల్లుడిగా కనిపిస్తా. సినిమా పేరు ‘వెంకీ మామ’. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో మొదలవుతుంది.” అని స్పష్టం చేశారు. “మీరు, సమంత ఏప్రిల్‌లో న్యూయార్క్‌ ‘ఏ మాయ చేసావె’ చిత్రీకరించిన ప్రదేశానికి వెళ్లారు కదా… ముందు తీసుకున్న నిర్ణయమా? అని అడగ్గా… చైతూ ఇలా సమాధానమిచ్చారు. ‘‘అవును. పెళ్లికి ముందే సామ్‌ నాకు చెప్పింది… పెళ్లి తర్వాత అక్కడికి వెళ్ళాము’’ అని నాగచైతన్య చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus