మెగా హీరోలను అనుసరిస్తున్న నాగ చైతన్య

  • April 28, 2017 / 07:42 AM IST

మెగా హీరోలను అక్కినేని హీరో అనుకరిస్తున్నాడా?.. అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు సినీ విశ్లేషకులు. ఏ విషయంలో అని అడిగితే ఇలా చెప్పుకొచ్చారు. ఇది వరకు ప్రతి సినిమాకి గ్రాండ్ గా ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. వాటిని అల్లు అరవింద్ ఆపి కొత్త విధానానికి తెరలేపారు. ఆడియోని ఆన్లైన్లో రిలీజ్ చేసి, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడం మొదలెట్టారు. అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో ప్రారంభమైన ఈ పద్దతి ఇప్పుడు ట్రెండ్ గా మారింది. మెగా హీరోలందరూ ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. ధృవ, ఖైదీ నంబర్ 150 మూవీలకు ఆడియో వేడుక లేకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. ఇదే విధంగా ఇప్పుడు అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య సినిమాకి చేస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా పాటల్ని నేరుగా మార్కెట్లోకి విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటలను మే 1న  యూట్యూబ్ లో అప్ లోడ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. సోగ్గాడే చిన్నినాయనా సినిమా తర్వాత కల్యాణ్ కృష్ణ డైరక్ట్ చేస్తున్న ఈ మూవీ  ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను మే 13న నిర్వహించనున్నట్లు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ  సినిమాను 19వ తేదీన విడుదల చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus