టాలీవుడ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య సమంతతో విడాకుల ప్రకటన వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చైసామ్ విడాకులు తీసుకోవడానికి అసలు కారణం తెలియకపోవడంతో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా పేజీలలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చైతన్య, సమంత వేర్వేరుగా ఫేక్ వార్తలను ఖండించారు. చైసామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల సక్సెస్ వల్ల నాగచైతన్య సైతం చాలా సంతోషంగా ఉన్నారు.
చైతన్యకు కార్లు అన్నా బైక్స్ అన్నా ఎంతో ఇష్టం అనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చైతన్య తన జీవన విధానం గురించి మాట్లాడుతూ ఫ్రీ టైమ్ లో కార్లు, బైకుల గురించి ఎక్కువగా స్టడీ చేస్తానని తెలిపారు. సినిమాలు కాకుండా తనకు ఇష్టమైన ప్రపంచం అదేనని చైతన్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా, థాంక్యూ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ షూటింగ్ తో బిజీగా ఉన్న నాగచైతన్య నాన్న పుట్టినరోజు బహుమతిగా ఇచ్చిన కారును రీ మోడల్ చేయించుకున్నానని తెలిపారు.
చైతన్య తన తర్వాత సినిమాల ఫలితాల విషయంలో సైతం ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చైసామ్ మళ్లీ కలిసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. నాగచైతన్యకు సినిమాసినిమాకు క్రేజ్, మార్కెట్ పెరుగుతుండటంతో అభిమానులు సైతం చాలా సంతోషిస్తున్నారు. యువతలో చైతన్యకు క్రేజ్ ఎక్కువగా ఉంది. బంగార్రాజు సినిమా ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో బంగార్రాజు సినిమా కలెక్షన్లపై కరోనా కేసుల ప్రభావం పడిందని సమాచారం. అయితే 2022 సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా బంగార్రాజు నిలిచింది. బంగార్రాజు ఓటీటీ రిలీజ్ గురించి స్పష్టత రావాల్సి ఉంది. జీ5 యాప్ లో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కానుందని సమాచారం.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!