Nagarjuna, Naga Chaitanya: ‘బంగార్రాజు’ కొత్త పోస్టర్.. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందిగా..!

2016 లో వచ్చిన నాగార్జున సూపర్ హిట్ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’ కి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ చిత్రం తెరకెక్కుతోందని అప్పుడే ప్రకటించారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వినిపించిన కథ కూడా నాగార్జునని ఇంప్రెస్ చేయడంతో వెంటనే సెట్స్ పైకి వెళ్ళిపోవాలి అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ పనులు డిలే కావడంతో ఇన్నేళ్ళు టైం పట్టింది. మొత్తానికి ‘బంగార్రాజు’ ని సెట్స్ పైకి తీసుకెళ్ళడం శరవేగంగా షూటింగ్ జరుపుతుండడం అభిమానుల్లో ఆసక్తిని పెంచే విషయాలు.

అంతేకాదు అప్పుడే టీజర్ ను కూడా విడుదల చేసేస్తున్నట్టు ప్రకటించి మరింత ఆశ్చర్యానికి గురిచేసారు మేకర్స్. నవంబర్ 23న నాగ చైతన్య పుట్టినరోజు ‘బంగార్రాజు’ టీజర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే సినిమాలో చైతన్య ‘బంగార్రాజు’ గా కనిపించబోతున్నాడు అని ప్రకటించడం అందరినీ కన్ఫ్యూజన్లోకి నెట్టిందని చెప్పాలి. ఇది ‘సోగ్గాడు’ కి సీక్వెల్ అయితే బంగార్రాజు ఇంత ట్రెండీగా ఎలా ఉన్నాడా అని?

ఇన్సైడ్ సిర్కిల్స్ ప్రకారం… ‘బంగార్రాజు’ కి కొడుకు రాముకి పుట్టిన బిడ్డకి ‘బంగార్రాజు’ అని పేరు పెడతారట. అలా అసలు బంగార్రాజు మళ్ళీ పుట్టినట్టు.. అతన్ని చైతన్యలా చూపిస్తారని టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక చైతన్య సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. ఆమె పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలవ్వడం దానికి మంచి రెస్పాన్స్ రావడం కూడా జరిగింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus