Naga Chaitanya: ఆ ఇండస్ట్రీలో చైతన్య సత్తా చాటుతారా?

  • June 23, 2022 / 11:24 PM IST

చైతన్య కృతిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కి విడుదలైన బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారని సమాచారం అందుతోంది.

నాగచైతన్య 22వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఒకే సినిమా కోసం పని చేయడం ఇదే తొలిసారని బోగట్టా. హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. జులై నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుండగా వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కావాల్సి ఉంది. వెంకట్ ప్రభు ఈ సినిమాతో టాలీవుడ్ లో లక్ ను పరీక్షించుకోనున్నారు.

నాగచైతన్య కృతిశెట్టి జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగచైతన్య ఈ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. నాగచైతన్య పదేళ్లలోనే 20కు పైగా సినిమాలలో నటించడం గమనార్హం. ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా చైతన్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా నటించిన క్లాస్ సినిమాలతో నాగచైతన్య తన రేంజ్ ను పెంచుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే చైతన్య రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు. మాస్ సినిమాలు నాగచైతన్యకు సక్సెస్ ను అందించకపోయినా క్లాస్ సినిమాలతోనే నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus