“సమంత సినిమాలకు గుడ్ బై” అనే వార్తలపై స్పందించిన నాగ చైతన్య!

  • July 9, 2018 / 12:50 PM IST

యువ సామ్రాట్ నాగచైతన్యని సమంత పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు గుడ్ బై చెబుతుందనే వార్తలు అనేక సార్లు చక్కర్లు కొట్టాయి. పెళ్లి అయిన కొత్తల్లో ఈ విషయంలో ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. పైగా వివాహం అనంతరం కొత్త సినిమాలకు సమంత సైన్ చేయడంతో నటిస్తూనే ఉంటుందని అర్ధమయింది. ఇప్పుడు తమిళంలో సూపర్ డీలక్స్, సెమ్మ రాజాలలో హీరోయిన్ గా నటిస్తోంది. యూటర్న్ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. వీటి తర్వాత “నిన్నుకోరి” హిట్ తో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో పని చేయనున్నారు. హరీశ్ పెద్ది, సాహు గారపాటి కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో సమంత, నాగచైతన్య కు భార్య భర్తల్లా నటించనున్నారు.

అయితే హీరోయిన్ గా సమంతకి ఇదే ఆఖరి మూవీ అని ప్రచారం సాగింది. ఆ చిత్రం తర్వాత నటనకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ మధ్య సమంత ఏ కొత్త సినిమాకి సంతకం చేయకపోవడంతో రూమర్ వ్యాపించింది. ఈ వార్తలపై నాగచైతన్య స్పందించారు.  “ఈ మధ్య వచ్చిన వార్తల్లో నిజం లేదు. తను సినిమాల్లో నటిస్తుంది. కాకపోతే అప్పుడప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంటుందేమో.. అంతకుమించి ఏం ఉండదు. తనకు సినిమాలంటే ఫ్యాషన్. ఈ రంగానికి దూరం కాదు” అని చైతన్య స్పష్టం చేశారు. దీంతో సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus