తనపై వచ్చిన వార్తల్లో నిజం లేదన్న నాగ చైతన్య

  • February 23, 2018 / 08:07 AM IST

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారు. పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారంతో బ్రేకింగ్ న్యూస్ లో నిలిచిన ఈ హీరో.. తర్వాత కూడా అదే విధంగా వార్తల్లో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ప్రేమ, పెళ్లి విషయంలో కాకుండా కెరీర్ గురించి చైతూ పై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నాగచైతన్య, బాబీ దర్శకత్వంలో నటించబోతున్నారని, యువ డైరక్టర్ సౌజన్య కథకి ఒకే చెప్పారని ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తుందని గాసిప్స్ వచ్చాయి. అంతేకాదు తన భార్య సమంతతో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై విసిగిపోయిన నాగ చైతన్య స్పందించారు.

తన సినిమాల గురించి వస్తున్న వార్తలు నమ్మొద్దని తెలిపారు. “నా సినిమాల గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రస్తుతం ‘సవ్యసాచి’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ రెండు సినిమాలు చక్కగా రూపుదిద్దుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న కథలు వింటున్నాను. నా తదుపరి సినిమాల గురించి త్వరలో వెల్లడిస్తాను.” అని అని నాగచైతన్య ట్వీట్‌ చేశారు. ఇలా రూమర్లకు చెక్ పెట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus