పెళ్లి తర్వాత లాంగ్ హాలీడేస్ తీసుకోనున్న నాగ చైతన్య, సమంత

  • July 5, 2017 / 06:53 AM IST

ఏ మాయ చేసావే సినిమాతో లవర్స్ గా పరిచయమైన సమంత, నాగ చైతన్యలు పెద్దల సమక్షంలో జనవరి 29న నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి పీటలపై కూర్చునేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ ఆరవ తేదీన భార్య భర్తలు కానున్నారు. నెక్స్ట్ ఏంటి…. పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కి ఎక్కడికి వెళుతారని .. కొన్ని రోజులుగా చర్చ మొదలయింది. ఇందుకు సమాధానం దొరికింది. కళ్యాణం తర్వాత నాగ చైతన్య, సమంత 40 రోజుల పాటు కలిసి విహరించనున్నట్లు తెలిసింది. హానీమూన్ ని అమెరికాలో ప్లాన్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల వారు చెప్పుకుంటున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాతే సినిమాల గురించి ఆలోచిస్తారంట.

ఇక పెళ్లి ముహూర్తానికి పదిహేను రోజుల ముందే సినిమా పనులన్నింటినీ కంప్లీట్ చేయాలనీ చైతూ, సామ్ భావిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణ దర్శకతంలో యుద్ధం శరణం సినిమాని చేస్తున్నారు. రామ్ చరణ్ తో రంగస్థలం 1985, సావిత్రి బయోపిక్ మహానటిలో, రాజుగారి గదిలో సమంత నటిస్తోంది. మరో మూడు తమిళ సినిమాలు కూడా చేస్తోంది. వీటన్నింటినీ సెప్టెంబర్ 20 వ తేదీ నాటికీ కంప్లీట్ చేయాలనీ ఇద్దరూ శ్రమిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus