మలయాళం సినిమా “ప్రేమమ్” రీమేక్ లో నటిస్తున్న నాగచైతన్య మరో రీమేక్ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. గతవారం తమిళంలో విడుదలైన “మెట్రో” అనే సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. ఆడీయన్స్ కూడా బాగానే చూస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట నాగచైతన్య.
చైన్ స్నాఛింగ్ గ్యాంగ్ చుట్టూ తిరిగే ఈ కథ చాలా నేచురల్ గా తెరకెక్కించబడీంది. అందుకే తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలో హింసపాళ్ళు మారీ ఎక్కువగా ఉన్నాయని సెన్సార్ వారు మొదట్లో సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు.
ఆ సినిమాను నాగచైతన్య ఎందుకు రీమేక్ చేయాలనుకొంటున్నాడో అర్ధం కావడం లేదు. మరి నాగచైతన్య ఆలోచన ఎంతవరకూ కరెక్టో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే!