“ఎవరికి.. ఎవరిని జంటగా అనుకుంటాడో.. ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు” .. ఏ మాయ చేసావే సినిమాలోని “మనసా మళ్లీ మళ్లీ చూసా” అనే పాటలో వచ్చే ఈ లైన్ విన్నప్పుడు.. నిజంగా దేవుడు ఇద్దరి మనసులను ఎప్పుడో ముడి వేస్తాడని అనిపిస్తుంటుంది. యువ సామ్రాట్ నాగ చైతన్య, సమంతల ప్రేమకు ఆరేళ్లక్రితమే బీజం పడింది. ఇప్పుడు అది మహా వృక్షమైంది. ఆ పచ్చని చెట్టుకింద ఇద్దరూ సేద తీరుతున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతున్నారు. షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు.
తాజాగా సమంత చైతూకి షాకిచ్చింది. ప్రస్తుతం నాగ చైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వైజాక్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ స్పాట్ కి నిన్న సమంత వెళ్లి అందరినీ ఆశ్చర్య పరిచింది. చైతూ ప్రియురాలిని చూసి మొదట షాక్ తిన్నా, తర్వాత ఆనందించారు. ఇద్దరూ కలిసి కబుర్లలో మునిగిపోయారు. ఈ ప్రేమ పక్షులు వచ్చే ఏడాది పెళ్లి పీఠలు ఎక్కనున్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.