Dhootha: నాగచైతన్య ‘దూత’ వచ్చేస్తున్నాడు? ఏం చెబుతాడు, ఏం రాస్తాడు!

  • November 16, 2023 / 12:35 PM IST

అక్కినేని నాగచైతన్య ఓ వెబ్‌ సిరీస్‌ చేశారు? చాలా నెలల క్రితమే ఆ సిరీస్‌ షూటింగ్‌ పూర్తయిపోయినా, ఎందుకు స్ట్రీమింగ్‌ చేయడం లేదు అంటూ ఓ ప్రశ్న వినిపించేది. కొంతమంది అయితే ఇక ఆ సిరీస్‌ రాదు అని కూడా కామెంట్లు చేశారు. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ వెబ్‌ సిరీస్‌ ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జర్నలిస్టుల నేపథ్యంలో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ను డిసెంబరు 1 నుండి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ చేయబోతున్నారు.

వెబ్‌ సిరీస్‌ పోస్టర్‌ చూశాక… ఏదో హారర్‌, థ్రిల్లర్‌ టచ్‌ ఉన్న కాన్సెప్ట్ అని అర్థమైంది. టీజర్‌ పోస్టర్‌లో పేపర్‌ ముఖానికి అడ్డంగా ఉన్నట్లు చూపించారు. ఆ రెండు కాన్సెప్ట్‌ డిఫరెంట్‌గా అనిపించాయి. అయితే ఈ రెండు కాన్సెప్ట్‌లు కలిపే ఈ వెబ్‌ సిరీస్‌ను సిద్ధం చేశారట. జర్నలిస్టులు, ఆత్మహత్యల నేపథ్యంలో ‘దూత’ సిరీస్ తెరకెక్కించినట్లు సమాచారం. చైతు లుక్‌లో ప్రముఖ పాత్రికేయుడు, ఆత్మహత్య లాంటి పదాలను హైలైట్ చేశారు.

‘‘మిస్టరీనా మెసేజా… త్వరలో మీరు తెలుసుకుంటారు’’ అని ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ట్వీట్‌ చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తారు. ఈ సిరీస్‌లో చైతుకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించింది. అయితే టైమ్ ట్రావెల్ అంశం కూడా సిరీస్‌లో ఉండబోతోందట. ఈ (Dhootha) వెబ్‌ సిరీస్‌ మొత్తం 3 సీజన్స్ ఉంటుందట. ఒక్కో సీజన్‌లో 8 నుండి 10 ఎపిసోడ్స్ ఉంటాయట.

ఇక్కడో ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఏంటంటే… నాగ చైతన్యకు హారర్, భయపెట్టే సినిమాలు చూడటం అంటే భయమట. దయ్యాలు, ఆత్మలు, భూతాలు నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు చూడరట. అందుకే హార‌ర్‌ చిత్రాలకు దూరం అని గతంలో చెప్పారు. అలాంటి చైతు ఇప్పుడు అలాంటి వెబ్‌ సిరీస్‌తోనే ఓటీటీ రంగంలోకి వస్తున్నారు. ఎందుకు, ఏంటి అనేది చైతు ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌కు బయటకు వస్తే కానీ తెలియదు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus