Naga Shaurya, Ritu Varma: ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నాగ శౌర్య!

నాగ శౌర్య హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన వరుడు కావలెను మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో రానా ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. శేఖర్ కమ్ముల శిష్యురాలైన లక్ష్మీ సౌజన్య వరుడు కావలెను సినిమాతో గ్యారంటీగా సక్సెస్ ను సొంతం చేసుకుంటారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే గత కొన్ని నెలలుగా నాగ శౌర్య, రీతూవర్మ మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

టీజర్ లో, ప్రమోషన్స్ లో రీతూ వర్మనే హైలెట్ చేస్తున్నారని నాగ శౌర్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే వైరల్ అయిన కామెంట్ల గురించి నాగ శౌర్య స్పందించి స్పష్టతనిచ్చారు. తనకు రీతూవర్మకు గొడవ జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె చెప్పుకొచ్చారు. రీతూవర్మ వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేదని నాగశౌర్య చెప్పుకొచ్చారు.

ఈ సినిమా చేసినందుకు తాను గర్వపడుతున్నానని కథను బట్టి ఈ సినిమాకు నిర్మాతలు బడ్జెట్ పెట్టారని నాగశౌర్య పేర్కొన్నారు. కెమెరామ్యాన్ వంశీ వల్లే తాను ఈ సినిమాలో ఇంత అందంగా కనిపిస్తున్నానని నాగ శౌర్య వెల్లడించారు. నాగ శౌర్య వరుడు కావలెను సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus