టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య తాజాగా కృష్ణ వింద్ర విహారి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా నేడు విడుదలవుతున్న నేపథ్యంలో నాగశౌర్య పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సినిమా ప్రమోషన్ కోసమే ఏకంగా ఈయన పాదయాత్ర చేయడం అందరిని ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగశౌర్య తన వ్యక్తిగత విషయాలు గురించి కూడా ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ శౌర్య యాంకర్ నుంచి తన పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. పెళ్లెప్పుడు అంటూ యాంకర్ ప్రశ్నించగా చెప్తాను అంటూ నాగశౌర్య సమాధానం చెప్పడంతో వెంటనే యాంకర్ త్వరలోనే అవుతుందా? అని మరో ప్రశ్న వేశారు. పెళ్లి చేసుకోబోయేది తెలుగు అమ్మాయినేనా? ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా? అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు అడిగారు.ఇలా యాంకర్ నుంచి పెద్ద ఎత్తున పెళ్లి గురించి ప్రశ్నలు రావడంతో
నాగశౌర్య నవ్వుతూ ప్రస్తుతం దాని ఎవరితోనూ డేటింగ్ లో లేనని సమాధానం చెప్పడమే కాకుండా తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తెలుగు అమ్మాయి అంటూ నాగశౌర్య ఈ ఇంటర్వ్యూ సందర్భంగా హింట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా నాగ శౌర్య పెళ్లి గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతోఈయన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని త్వరలోనే పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఈయన నటించిన కృష్ణ వింద్రా విహారి సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.