ప్రస్తుతం టాలీవుడ్ లో యువ హీరోల్లో నాగ శౌర్యకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా ఆయన ఖాతాలో మంచి హిట్స్ కూడా ఉన్నాయి. అయితే మొదటి నుంచీ లవర్ బోయ్ పాత్రల్లో కనిపిస్తూ లవ్ స్టోరీస్ నే ఎంచుకున్న ఈ కుర్ర హీరో మధ్యలో అడపాదడపా యాక్షన్ పాత్రలు సైతం చేశాడు. అయితే అవి పెద్దగా అచ్చి రాలేదు కానీ కుర్రాడికి మంచి పేరు అయితే వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా నాగశౌర్య తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ కు షాక్ ఇచ్చింది…అదేమిటంటే ఈ కుర్ర హీరో ప్రయోగం చెయ్యబోతున్నాడని సమాచారం. ఇంతకీ ఆ ప్రయోగం ఏంటి అంటే….ఓ సినిమాలో తనే హీరోగా తనే విలన్ గా నటించడం. కిరణ్ అనే ఓ కొత్త దర్శకుడు చెప్పిన ఒక కథ నాగశౌర్యకి బాగా నచ్చిందట. అందుకే కాదనలేక ఆ దర్శకుడికి ఓకే కూడా చెప్పేసాడంటా.
అయితే సాఫ్ట్ గా ఉండే హీరో, లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న హీరో ఇలా ప్రయోగాలు చెయ్యడం ఎంతవరకూ నిజమో తెలీదు కానీ…నాగశౌర్య మాత్రం ఇది కొత్త రకమైన విలనిజం అని, తనకు బాగా నచ్చడంవల్ల ఈ కధను ఎంచుకున్నట్లు తన సన్నిహితుల వద్ద చెబుతున్నాడని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం. అంతేకాకుండా కొత్త ప్రయోగాలు చేస్తేనే తనలోని ప్రతిభ బయట పడుతుంది అని తెలుపుతున్నాడు. ఇక ప్రేక్షకులు థ్రిల్ కి గురవుతారనుకుంటే ఎలాంటి ప్రయోగాలకైనా ఓకే అంటున్నారు ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలు, బహుశా నాగశౌర్య కూడా అదే శైలి ఫాలో అయితే బెటర్ అనుకున్నడొ ఏమో కానీ మొత్తానికి సినిమాకు జెండా ఊపేశాడు. మరి ఈ ప్రయోగం ఆయనకు ఎలాంటి అవకాశాలను తెచ్చిపెడుతుందో చూద్దాం.