యంగ్ హీరోల్లో నాగ శౌర్య ది ఓ ప్రత్యేకమైన శైలి. కెరీర్ ప్రారంభంలో తాను చేసిన ‘చందమామ కథలు’ నుండీ ‘ఊహలు గుస గుస లాడే’ ‘దిక్కులు చూడకు రామయ్య’ ‘జాదూగాడు’ ‘జ్యో అచ్యుతానంద’ ‘ఛలో’ ‘ఓ బేబీ’ ‘అశ్వద్ధామ’ వంటి చిత్రాల్లో ఏదో ఒక కొత్తదనం చూపిస్తూనే వస్తున్నాడు. ఇతనిలో మంచి రైటర్ కూడా ఉన్నాడని ‘అశ్వద్ధామ’ చిత్రం నిరూపించింది. ఇదిలా ఉండగా.. నాగశౌర్య తన 20 వ చిత్రంలో కండలు తిరిగిన శరీరంతో కనిపించబోతున్నట్టు ఈ మధ్యనే కొన్ని లుక్స్ విడుదలయ్యి నెట్టింట్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలల్లో ప్రారంభమయ్యింది. నాగ శౌర్య ఈ చిత్రంలో ఆర్చర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో పలు కీలక సన్నివేశాల కోసం నాగ శౌర్య 8 ప్యాక్ బాడీలో కనిపించాల్సి వచ్చిందట. అందుకు గాను ఇతను స్ట్రిక్ట్ డైట్ ను ఫాలో అవ్వడంతో పాటు.. జిమ్ లో ఎంతో కష్టపడి వర్కౌట్లు చేసాడని తెలుస్తుంది. ఐదు రోజుల పాటు చిత్రీకరించిన కీలక సన్నివేశాల కోసం అయితే ఇతను కనీసం మంచి నీళ్ళు త్రాగకుండా ఉండటమే కాకుండా..
కనీసం తన సెలైవా(లాలా జలాన్ని) కూడా మ్రింగేవాడు కాదట.అంత కష్టపడ్డాడని తెలుస్తుంది. ‘నాగశౌర్యకు సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉంది’.. అన్న విషయం ఈ ఒక్క ఉదాహరణను బట్టి చెప్పొచ్చు. ఇక ఈ స్పోర్ట్స్ డ్రామాలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించబోతుంది.