తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొద్దీ రోజుల్లోనే మెగా ప్రిన్సెస్ నిహారికతో కలిసి నటించే అవకాశం దక్కించుకుని లక్కీ హీరోగా పేరు తెచ్చుకున్న నాగశౌర్యకు మరో ఛాన్స్ తలుపు తట్టింది. కమర్షియల్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం వరించింది. ప్రస్తుతం పూరి “ఇజం” సినిమాను తెరకెక్కిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. దసరా కానుకగా రిలీజ్ కానుంది.
ఈ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేసేందుకు అంతా ఒకే అయింది. కానీ ప్రిన్స్ డేట్స్ ఏడాది వరకు ఖాళీ లేవు. కాబట్టి ఆ లోపున ఓ చిన్న సినిమాని స్వీయ దర్శకత్వంలో నిర్మించాలని డిసైడ్ అయ్యారు. డిఫరెంట్ లవ్ స్టోరీని కూడా రెడీ చేశారు. ఈ మూవీలో ఇద్దరు హీరోలు ఉండనున్నారు. ఒక హీరో గా “పెళ్లిచూపులు” ఫెమ్ విజయ్ దేవర కొండ ఫిక్స్ అయ్యాడు. మరో హీరో గా నాగ శౌర్య ఖరారు అయ్యాడు. పూరి కొన్ని రోజుల క్రితం నాగ శౌర్య తో మాట్లాడారని, యువ హీరో సంతోషంగా ఒప్పుకున్నాడని తెలిసింది. పూరి జగన్నాథ్ సినిమాతో విజయ్, నాగ శౌర్య ల కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగి పోతుందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.