Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ఛలో చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్!

ఛలో చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్!

  • December 16, 2017 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఛలో చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్!

“ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌ వైభోగం”,” జ్యో అచ్యుతానంద” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగ‌శౌర్య. త్రివిక్రమ్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఛలో. శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు, ఫస్ట్ సాంగ్ కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి 2018, ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ… ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఛలో ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్ ను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఫిబ్రవరి 2న మీ ముందుకు రాబోతున్నాం. మహతి స్వర సాగర్ అందించిన పాటలు అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లారు. సాయి శ్రీ రామ్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రధాన బలం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ తో ఈ విషయం అర్థమై ఉంటుంది. అద్భుతమైన విజువల్స్ అందించారు. నాగశౌర్య పెర్ ఫార్మెన్స్ చాలా కొత్తగా ఎనర్జిటిక్ గా ఉంటుంది. తన కెరీర్లో పర్ ఫెక్ట్ కమర్షియల్ మూవీగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. హీరోయిన్ రష్మిక మండన్న, నాగశౌర్య మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. సినిమా చాలా బాగా వచ్చింది. నాకు అన్ని విధాల సహకరించి… ఇంత మంచి సినిమా తీసేందుకు దోహదపడ్డ మా నిర్మాతలకు నేను రుణపడి ఉంటాను. నేను ఎలాంటి టెన్షన్ పడకుండా సినిమాకు ఏం కావాలో అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి ప్రోత్సహించారు. ఫిబ్రవరి 2న మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా అని అన్నారు.

కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ… నన్ను మొదటి నుంచి అమితంగా ఆదరిస్తున్న మీడియా మిత్రులందరికీ చాలా థాంక్స్. టీజర్ కు, ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అందరికీ చాలా థాంక్స్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ మా కెమెరామెన్ సాయి శ్రీరామ్ గారు. ఆయన లేకుంటే ఈ సినిమా చేయకూడదు అనుకున్నాం. మేము అంతగా నమ్మాం. మమ్మల్నిచాలా బాగా చూపించారు. హీరోయిన్ రష్మిక మండన్న చాలా బాగా చేసింది. మహతి స్వర సాగర్ అద్భుతంగా పాటల్ని కంపోజ్ చేశారు. రీ రికార్డింగ్ కూడా అదే రేంజ్ లో ఇస్తున్నారు. మా దర్శకుడు వెంకీ… చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. తాను ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవ్వడం ఖాయం. చాలా రోజులుగా నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నానో అలాంటి మంచి కమర్షియల్ సినిమా చేశాడు. అన్ని వర్గాల్ని మెప్పించే ఎలిమెంట్స్ ని జోడించి రూపొందించిన చిత్రం ఇది. మా సొంత బ్యానర్లో వస్తున్న మొదటి సినిమా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరి 2, 2018న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్ణయించాం. త్వరలోనే ఛలో చిత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నాం. అని అన్నారు.

చిత్ర సమర్పకుడు… శంకర ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ…. మా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1గా నిర్మించిన ఛలో చిత్రాన్ని ఫిబ్రవరి 2, 2018న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నాగశౌర్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చే చిత్రంగా ఛలో నిలుస్తుందని నమ్ముతున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chalo Movie
  • #Chalo Telugu Movie
  • #Naga Shourya
  • #Rashmika Mandanna

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

4 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

5 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

5 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

5 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

6 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

8 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

10 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

11 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

11 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version