“కళ్యాణ్ వైభోగమే” సినిమా సూపర్ హిట్టయినా “జో అచ్యుతానంద, ఒక మనసు” వంటి ఎప్పుడో ఎనౌన్స్ అయిన సినిమాలు మినహా ఇప్పటివరకూ మరో కొత్త సినిమా అంగీకరించని నాగశౌర్య “పిచ్చేక్కిస్తా” అనే సినిమా తెరకెక్కించిన శ్రీకాంత్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడని తెలుస్తోంది.
పలు షార్ట్ ఫిలిమ్స్ తో యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన శ్రీకాంత్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన తోలి చిత్రం “పెచ్చేక్కిస్తా”ను బీగ్రేడ్ సినిమాగా అభివర్ణించారు విశ్లేషకులు. హీరోయిన్ చేత అందాలు ఆరబోయించి ప్రేక్షకుల్ని థియేటర్ వరకూ తీసుకురాగలిగిన శ్రీకాంత్. రెండున్నర గంటలు వారిని కూర్చోబెట్టలేకపోయాడు.
ఆ తర్వాత మళ్లీ షార్ట్ ఫిలింస్ తీసుకొంటూ వస్తున్న శ్రీకాంత్ చెప్పిన కొత్త కథ విపరీతంగా నచ్చడంతో.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శౌర్య, మరి తనకు లభించిన రెండో అవకాశంతోనైనా శ్రీకాంత్ రెడ్డి తన ప్రతిభను నిరూపించుకొంటాడే లేదో చూడాలి!