Nagababu: భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు!

మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడంతో పాటు పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించారు. ఈ మధ్య కాలంలో నాగబాబు పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. అక్టోబర్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగగా నాగబాబు ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు ఇవ్వడంతో పాటు ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలవడానికి ఎంతో కష్టపడ్డారనే సంగతి తెలిసిందే. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో విష్ణు అధ్యక్షునిగా విజయం సాధించారు.

తాజాగా నాగబాబు ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. భార్య పద్మజ పుట్టినరోజు సందర్భంగా నాగబాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ ప్రపంచం ఎంతో కఠినమైన ప్రదేశమని భార్య పద్మజ లేకపోయుంటే ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడం మరింత కష్టమయ్యేదని నాగబాబు తెలిపారు. భార్య పద్మజ ఎల్లప్పుడూ తనతో ఉంటూ ప్రేమతో, ముందుచూపుతో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసినందుకు కృతజ్ఞతలని నాగబాబు అన్నారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ పద్మజ అంటూ నాగబాబు భార్యకు శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. భార్యతో కేక్ కట్ చేయించిన ఫోటోలను నాగబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. నాగబాబు చేసిన భావోద్వేగ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భార్యతో, కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను సైతం నాగబాబు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నాగబాబు చేసిన పోస్ట్ కు రికార్డు స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. వరుణ్ తేజ్, నిహారిక కూడా తల్లికి బర్త్ డే గ్రీటింగ్స్ ను తెలియజేశారు.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే నాగబాబు పలు కామెడీ షోలకు గెస్ట్ గా హాజరవుతున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నా నాగబాబు ఫ్యామిలీకి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. నాగబాబు బుల్లితెర సీరియళ్లలో కూడా నటించిన సంగతి తెలిసిందే. పలు సినిమాలకు నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus