Nagababu: ఆ పార్టీ నేతలపై నాగబాబు ఫైర్.. ఎండ్ కార్డ్ దగ్గర్లోనే ఉందంటూ?

జనసేన నేత, ప్రముఖ నటుడు నాగబాబు ఒకవైపు పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తున్నారు. నాగబాబు రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లోనే ఉందని తెలుస్తోంది. తాజాగా చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆ కామెంట్లకు వైసీపీ నేతల నుంచి ఊహించని విధంగా కౌంటర్లు వచ్చాయి. ఈ వివాదాల వల్ల భోళా శంకర్ సినిమాపై ఎఫెక్ట్ పడుతుందేమో అని అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారు.

అయితే వైసీపీ నేతలు చేసిన కామెంట్ల గురించి నాగబాబు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ శ్రమను పెట్టుబడిగా పెట్టి ప్రభుత్వానికి అణా పైసలతో సహా ట్యాక్స్ కట్టి వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచి పెట్టి 24 క్రాఫ్ట్స్ కు అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ అని పేర్కొన్నారు. ఏపీ మంత్రులు నిజం మాట్లాడిన వ్యక్తి విషయంలో విషం కక్కుతున్నారని నాగబాబు అన్నారు.

చిరంజీవి ఫోటో కోసం పడిగాపులు కాసిన వాళ్లు సైతం కారుకూతలు కూస్తున్నారని నాగబాబు వెల్లడించారు. ఆకాశం మీద ఉమ్మాలంటే మీ మొహం మీద పడుతోందని మీ బ్రతుకుకు మీ శాఖల మీద అవగాహన ఉండదని అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదని నాగబాబు కామెంట్లు చేశారు. బటన్ నొక్కి కోట్లలో ముంచి వేల మందికి ఉచితాలను పంచడాన్ని అభివృద్ధి అనుకుంటున్నారా అని నాగబాబు (Nagababu) చెప్పుకొచ్చారు.

అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటేనే మీ ఆలోచనలు ఎంత క్షీణించిపోయాయో అర్థమవుతుందని నాగబాబు పేర్కొన్నారు. కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది.. ఆరోగ్యాలు జాగ్రత్త అని నాగబాబు చెప్పుకొచ్చారు. నాగబాబు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకు ఎండ్ కార్డ్ దగ్గర్లోనే ఉందని నాగబాబు అన్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus