మెగా బ్రదర్ నాగబాబు ఏం మాట్లాడినా చాలా స్పష్టంగా … అందరికీ అర్ధమయ్యేలా మాట్లాడుతూ ఉంటారు. కోపంగా మాట్లాడినా… కామెడీ చేసినా… సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా… అందరికీ కనెక్ట్ అయ్యేలా తన ఫీలింగ్స్ ను ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు నాగబాబు. ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో అది చూశాం. ఇదిలా ఉండగా… ఇటీవల నాగబాబు చేసిన కామెంట్స్ అందరి చేత కంటతడి పెట్టించాయనే చెప్పాలి. త్వరలో ఓ ఛానల్ లో టెలికాస్ట్ అవ్వబోయే షో కు సంబంధించి ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది.
ఆ ప్రోమో లో స్టార్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్.. ‘తన కూతురు కడుపులోనే చనిపోయింది’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.జానీ మాస్టర్ బాధను అర్ధం చేసుకున్న నాగ బాబు.. తన జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ…”ఫ్యామిలీ అంతా కలిసి న్యూజ్ ల్యాండ్ వెళ్ళాం. ఆ టైములో ఒకరోజు వాడెవడో నల్ల కోటు వేసుకుని ఉంటే… అది నేనే అనుకుని నిహారిక వాడి వెనుక వెళ్లిపోయింది.ఒక 20 నిమిషాల పాటు నిహారిక కనబడలేదు.
దాంతో న్యూజ్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళనందరినీ షూట్ చేసి చంపెయ్యాలి అనిపించింది.ఆ టైములో వరుణ్ ను ఇంటికి పంపేసి మేము సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాం. నా కూతురు లేకపోతే బ్రతికి ఉన్నా.. వేస్ట్ అనిపించింది” అంటూ ఎమోషనల్ అయ్యారు నాగబాబు.