టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు.ఈయన పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. అక్కినేని అమల గారు ఈయన రెండో భార్య. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక ఈమెను పెళ్లి చేసుకున్నారు నాగార్జున.మొదట టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు గారి అమ్మాయి లక్ష్మీతో నాగార్జున వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే నాగ చైతన్య. నాగార్జున, అమల సంతానం అఖిల్ అన్న సంగతి కూడా తెలిసిందే.
ఓ పక్క హీరోగా సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఘనత నాగార్జున కే చెల్లింది. ఇండస్ట్రీలో అందరితోనూ నాగార్జున స్నేహపూర్వకంగానే మెలుగుతూ ఉంటారు.అక్కినేని నాగేశ్వరరావు గారి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. ఆయన సొంత ట్యాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు నాగ్. ప్రస్తుతం ఆయన పి.ఎస్.వి.గరుడవేగా ఫేమ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఒక సినిమా అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ లో నటిస్తున్నారు.
అంతేకాకుండా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కూడా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు నాగార్జున. సరే ఈ విషయాలను పక్కన పెడితే..గత కొద్దరోజులుగా నాగార్జున మొదటి పెళ్లి ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. దానిని మీరు కూడా ఓ లుక్కేయండి: