కింగ్ నాగార్జున ఎలాంటి సినిమా చేయాలన్నా కూడా కథ కథనం కంటే ముందు దర్శకుడి పనితీరు నచ్చాలి. పర్సన్ ఆయనకు కనెక్ట్ అయితే సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. అందుకే నాగార్జున కొత్త దర్శకులతో ఎక్కువగా వర్క్ చేస్తుంటారు. నాగార్జునను మెప్పించ గలిగితే చాలు ప్లాప్ లో ఉన్నా కూడా ఏమి పట్టించుకోరని చెబుతుంటారు.
అయితే ఇటీవల ఒక దర్శకుడు ముందు కథ చెప్పిన తరువాత అంత ఒకే చేసుకున్నాక నాగార్జునతో కొన్ని విషయాల్లో విభేదించినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. గరుడవేగా సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ప్రవీణ్ సత్తారు. ఈ దర్శకుడు కథ చెప్పగానే అన్ని నాగార్జున నిర్ణయాల ప్రకారమే ప్లాన్ సెట్ చేసుకున్నాడట. ఇక ఇటీవల స్క్రిప్ట్ విషయంలో కొన్ని విబేధాలు వచ్చినట్లు టాక్ వచ్చింది. నాగార్జున ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టినట్లు టాక్.
ఇక నాగార్జున తదుపరి సినిమాగా బంగార్రాజును తీసుకురావాలని మరోక న్యూ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు సమాచారం. ఆ సినిమా తరువాతే మరో సినిమా గురించి ఆలోచించాలని అనుకుంటున్నాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!