స్టార్ హీరో నాగార్జున ప్రస్తుతం హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కొన్ని హిందీ సినిమాల్లో నటించిన నాగార్జున 17 సంవత్సరాల విరామం తరువాత బ్రహ్మాస్త్ర మూవీలో హిందీలో నటిస్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండగా ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రలో నటించడం గురించి నాగార్జున మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ కొరకు తాను కలలు కనలేదని నాగార్జున పేర్కొన్నారు. ఉత్తరాది ప్రేక్షకులు తనను ఆదరించినా అక్కడ స్టార్డమ్ తెచ్చుకోవాలని తాను ఆరాటపడలేదని నాగార్జున వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు సినిమాలతో సంతోషంగా ఉన్నానని హిందీలో మంచి ఆఫర్లు వస్తే నటించడానికి తనకు అభ్యంతరం లేదని నాగార్జున పేర్కొన్నారు. బ్రహ్మాస్త్ర మూవీలో తన రోల్ స్పెషల్ రోల్ అయినప్పటికీ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాలో ఒక పాత్ర కోసం తననే తీసుకోవాలని అనుకున్నానని చెప్పారని నాగార్జున వెల్లడించారు.
పాత్ర నచ్చడంతో సినిమాలో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని నాగ్ అన్నారు. హిందీలో తాను నటిస్తుండటం వల్ల నిర్మాతలకు లాభమని నాగార్జున పేర్కొన్నారు. హిందీలో నటిస్తే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముంబైలో తన సినిమాలు చూస్తారు కాబట్టి నిర్మాతలకు ఎక్కువ డబ్బులు వస్తాయని నాగార్జున వెల్లడించారు.