Nagarjuna: నా సామి రంగ సినిమా పై నాగార్జున కామెంట్స్!

  • January 29, 2024 / 01:01 PM IST

అక్కినేని నాగార్జున తాజాగా నా సామి రంగ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదలైనటువంటి ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకుంది. ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాగార్జున తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేశారు. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా నాగార్జున సినిమాని ఎంతో విజయవంతం చేసినటువంటి అభిమానులకు ప్రేక్షకులకు అలాగే సినిమా కోసం పని చేసినటువంటి టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేశారు.

ఇక ఈ సినిమాని ప్రకటించిన మూడు నెలల వ్యవధిలోనే విడుదలై మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.ఈ విషయం గురించి నాగార్జున మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాన్నగారి జయంతి రోజు స్టూడియోలో విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతున్న రోజే ఈ సినిమాని లాంచ్ చేసామని నాగార్జున తెలిపారు. ఈ సినిమాని అదే రోజు లాంచ్ చేస్తామని ఇంట్లో ఎవరికీ తెలియదు నేను సినిమా కార్యక్రమానికి వెళుతుండగా అమల ఇప్పుడు వెళ్లడం అవసరమా అంటూ అడిగారు.

ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలి అందుకే వెళ్లక తప్పదని నేను చెప్పడంతో అదేంటి సంక్రాంతికి విడుదల చేయాలా ఇంత తక్కువ సమయంలో ఎలా రిలీజ్ చేస్తారు ఏమైనా పిచ్చి పట్టిందా అంటూ అందరూ నా వంక ఆశ్చర్యంగా చూశారని నాగార్జున తెలిపారు. అమలతో పాటు అఖిల్ చైతన్య కూడా నన్ను అలాగే చూశారని కానీ ఈ సినిమాని తక్కువ సమయంలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం నమ్మింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా చిరు నవ్వుతోనే ఈ సినిమాని పూర్తి చేసి విడుదల చేసాము అంటూ నాగార్జున (Nagarjuna) చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus