టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జునకు అభిమానులు ఎక్కువన్నది అందరికీ తెలిసిన సంగతే. అయితే ఇప్పుడు ఆ విషయం మరో మారు రుజువైంది. సోషల్ మీడియాలో ఆయన్ను ఫాలో అవుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2010 మార్చిలో ట్విట్టర్ లో జాయిన్ అయిన నాగ్ ని ఇప్పటివరకు రెండు మిలియన్ (20 లక్షలు ) మంది ఫాలోఅవుతున్నారు. సినిమాల బిజీలో ఉండి ఇందులో పోస్టింగ్ లు అరుదుగా చేసే నాగార్జున రీసెంట్ గా ట్వీట్స్ జోరు పెంచారు. తనయుల చిత్రాలు, ప్రేమలు పెళ్లి గురించి ఎప్పటికప్పుడు అభిమానులు క్లారిటీ ఇస్తూ వచ్చారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటిస్తున్న నాల్గవ భక్తిరస చిత్రం “ఓం నమో వెంకటేశాయ” గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందించారు.
దీంతో ఈ ఏడాది అతన్ని అనుసరించేవారు సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు ఈ మార్క్ ని తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రాస్ చేశారు. హీరోయిన్స్ లో సమంత మూడు మిలియన్ తో దూసుకుపోతోంది. ట్విట్టర్లో నాగ్ రెండు మిలియన్ మార్క్ క్రాస్ చేయడంతో అక్కినేని అభిమానులు అనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో యంగ్ హీరోల కంటే నాగ్ కి ఎక్కువ క్రేజ్ ఉందన్న సంగతి ఈ అంకెలే నిదర్శనమని చెబుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.