Nagarjuna: ది ఘోస్ట్ బుకింగ్స్ నాగ్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయా?

  • October 4, 2022 / 04:53 PM IST

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ది ఘోస్ట్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు ఒకేరోజు థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో ది ఘోస్ట్ సినిమా బుకింగ్స్ పై ఆ ప్రభావం పడింది. మరోవైపు నాగార్జునను ఫ్యామిలీ కథాంశాలలో చూడాలని ఫ్యాన్స్ ఎక్కువగా కోరుకుంటున్నారు.

సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి, బంగార్రాజు తరహా సినిమాలు నాగార్జునకు సూట్ అవుతాయని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ది ఘోస్ట్ సినిమాలో కూడా సిస్టర్ సెంటిమెంట్ ఉన్నా యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్లలో హైలెట్ కావడంతో ఎక్కువమంది ప్రేక్షకులు ఈ సినిమా టాక్ వెల్లడైన తర్వాతే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని భావిస్తున్నారు. ది ఘోస్ట్ మూవీ టికెట్ బుకింగ్స్ ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతున్నాయి. ఈ మధ్య కాలంలో మన్మథుడు2, వైల్డ్ డాగ్ సినిమాలతో నాగార్జునకు భారీ షాకులు తగిలాయి.

నాగార్జున తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రవీణ్ సత్తారు సినిమా అంటే గ్యారంటీగా హిట్టవుతుందని చాలామందిలో భావన ఉంది. ది ఘోస్ట్ సినిమా అంచనాలను మించి హిట్ అవుతుందో లేదో చూడాలి. ది ఘోస్ట్ సినిమా 22 కోట్ల రూపాయల టార్గెట్ తో విడుదలవుతుండగా సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ టార్గెట్ ను అందుకోవడం కష్టమేమీ కాదు.

ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ నటించారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. నాగార్జున ది ఘోస్ట్ తర్వాత కొన్ని నెలల పాటు సినిమా షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus