కాబోయే కోడలికి వార్నింగ్ ఇచ్చిన అక్కినేని నాగార్జున

  • January 25, 2017 / 02:01 PM IST

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం జనవరి 29న వైభవంగా జరిపేందుకు నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తన కుటుంబానికి ఆత్మీయులైన వారిని ఆహ్వానించడం పూర్తి చేశారు. కొణిదెల, భూపాల్‌, ప్రభు ఫ్యామిలీలతోపాటు ఇంకా పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కానున్నారు. అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ హడావుడిలో ఉంటే సమంత నాగార్జునకు కోపం తెప్పించిందంట. మామగారిని  “సార్ ” అంటూ పిలిచి ఆగ్రహానికి గురిచేసినట్లు తెలిసింది. “ఇది వరకు అయితే సీనియర్ హీరో కాబట్టి, సార్ అంటూ మర్యాదించడంలో తప్పులేదు.. కోడలిగా కాబోతున్నప్పటికీ సార్ అని పిలవడం బాగా లేద”ని నాగార్జున సమంతకు చెప్పినట్లు సమాచారం.

ఇంకోసారి నాగ్ సార్ అంటూ పిలిచావంటే ఊరుకునేది లేదంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మొదట నుంచి నాగ్ సార్ అని పిలిచిన నోటికి .. మామగారు అనే పదం అలవాటు కావడానికి కొన్ని రోజులు టైం పడుతుందని సమంతను ఆమె స్నేహితులు ఆటపట్టిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus