పాపకు బూస్ట్ ఇవ్వనున్న నాగ్!
- November 29, 2016 / 07:53 AM ISTByFilmy Focus
కొత్త దర్శకులను వారిలోని టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలోనే కాదు.. సరికొత్త అందాలను తెలుగు చిత్రసీమకు పరిచయడంలోనూ అక్కినేని నాగార్జున సిద్ధహస్తుడు. ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం మొదలుకొని.. అప్పటికి సరైన హిట్ దొరక్క ఢీలా పడిన అందాల భామలకు తన సరసన నటించే అవకాశాలు ఇచ్చి వారి కెరీర్ లకు బూస్ట్ ఇచ్చిన నాగార్జున.. త్వరలోనే మరో అందాల భామకూ బూస్ట్ ఇవ్వనున్నాడు.
“రన్ రాజా రన్, కొలంబస్” చిత్రాల్లో నటించిన రింగుల జుట్టు సుందరి సీరత్ కపూర్ కు “రాజుగారి గది 2″లో హీరోయిన్ ఛాన్స్ కన్ఫర్మ్ అయిపోయిందని ఇండస్ట్రీలో ఇప్పటికే గుసగుసలు వినవస్తుండగా.. నాగార్జున ఎరికోరి ఈ భామను తన సరసన నటింపజేసుకోంటున్నాడని టాక్. సినిమాలతోపాటు పలు యాడ్స్ లోనూ నటించిన సీరత్ కపూర్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సో, ఇలాంటి అమ్మాయికి బూస్టప్ ఇవ్వడం మంచిది అని భావించిన నాగ్ “సీరత్”ను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశాడట. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















