Nagarjuna: నాగార్జున కొత్త సినిమా ‘నెర్వస్‌ 99’… ఎప్పుడు తేలుతుందో?

  • April 19, 2023 / 12:21 PM IST

నెర్వస్‌ 90`s.. ఈ మాట మనం ఎక్కువగా క్రికెట్‌లో వింటుంటాం. బ్యాటర్‌ 90 పరుగులు చేశాక సెంచరీ చేసేవరకు చిన్న నెర్వస్‌ ఉంటుంది అంటారు. మైల్‌ స్టోన్‌ లాంటి సెంచరీ కోసం చాలా జాగ్రత్తగా ఆడుతుంటారు. అయితే ఇప్పుడు అలాంటి నెర్వస్‌లో నాగార్జున ఉన్నారా? ఆయన సినిమా వార్తలు వింటుంటే అలానే అనిపిస్తోంది. దానికి కారణం ఆయన 99వ సినిమా విషయంలో సరైన నిర్ణయం కోసం ఆయన చాలా టైమ్‌ తీసుకుంటున్నారు. అదేంటి సినిమా ఓకే అయిపోయింది కదా అంటారా? అయిపోయింది కానీ.. అవ్వలేదు అనే మాట వినిపిస్తోంది.

యువ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ (Nagarjuna) నాగార్జున ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమానే నాగ్‌ 99వ సినిమా. చాలా రోజుల క్రితమే అన్‌ అఫీషియల్‌గా ప్రకటించేసిన ఈ సినిమా… ఇంకా మొదలుకాలేదు. సినిమా షూటింగ్ ఎంతకీ ప్రారంభం కాకపోవడం అభిమానుల అసహనానికి కారణమవుతోంది. ఈ మేరకు సోషల్‌ మీడయాలో ప్రశ్నలు, చర్చలు కూడా సాగుతున్నాయి. మలయాళం హిట్ సినిమా ‘పొరింజు మరియం జోస్’ అనే సినిమా ఈ సినిమా చిత్రం తెరకెక్కాల్సి ఉంది.

విలేజ్ డ్రామాగా సాగే ఈ సినిమా హక్కుల విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల రెండు నెలలు బ్రేక్ పడింది. ఆ తర్వాత మొదలవుతుందా అంటే పెంచిన గెడ్డం తీసేసి నాగ్‌ నార్మల్‌ లుక్‌లోకి వచ్చేశారు. దీంతో అసలు సినిమా ఉందా? లేదా? అనే ప్రశ్న మొదలైంది. కొత్త లుక్‌లోకి వచ్చినట్లే వచ్చి.. మళ్లీ ఎందుకు వెనక్కి వెళ్లారు అనేదే ఇక్కడ పాయింట్‌.

సినిమా కథ, ఇతర అంశాల విషయంలో పూర్తి సంతృప్తి లేకపోవడంతోనే నాగ్‌ క్లీన్ షేవ్ లుక్‌లోకి వచ్చేశారని ఇన్ సైడ్ టాక్. అంతేకాదు ఇప్పుడు మరో కాన్సెప్ట్‌, లుక్‌ పనిలో టీమ్‌ ఉందట. అంతా ఓకే అనుకుంటేనే ఈ సినిమా స్టార్ట్‌ చేస్తారు అని అంటున్నారు. మరీ అవసరమైన కొత్త ప్రాజెక్ట్‌ను 99గా ప్రకటించి, దీని సీరియల్‌ నెంబర్‌ మారుస్తారని కూడా అంటున్నారు. వందో సినిమా మోహన్‌రాజా దర్శకత్వంలో చేస్తారని ఇప్పటికే సమాచారం ఇచ్చేశారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus