అక్కినేని అభిమానులకు శుభవార్త. కింగ్ నాగార్జున చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్ధ ముహూర్తం ఖరారు అయింది. యువ సామ్రాట్ నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు ప్రేమలో పడడం, అందుకు నాగ్ అంగీకారం తెలపడంతో పెళ్లి ఎప్పుడు అనే విషయం పై సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు. ఎట్టకేలకు చిన్న కుమారుడి నిశ్చితార్థం శ్రేయా భూపాల్ తో డిసెంబర్ 9 న జరుగుతుందని వెల్లడించారు. పెళ్లి మాత్రం వచ్చే ఏడాది ఉంటుందని స్పష్టం చేశారు.
పెద్ద కుమారుడు నాగ చైతన్య పెళ్లి విషయం చెప్పకుండా అఖిల్ గురించి ప్రస్తావించడంపై విమర్శలు వెళ్లు వెత్తాయి. వీటికి నాగ్ అడ్డు కట్టవేశారు. చైతూ నిశ్చితార్ధ ముహూర్తం, వివాహ వేడుక తేదీలను ఒకే సారి త్వరలో వెళ్లడిస్తానని చెప్పారు. అయితే అఖిల్ హీరో గా రెండో చిత్రాన్ని పూర్తి చేయక ముందే పెళ్లి పీఠలపై కూర్చోనున్నాడన్నమాట.