అందులో తప్పు ఏముంది అంటున్న నాగ్!!!

  • February 2, 2017 / 06:56 AM IST

టాలీవుడ్ లో నాగ్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు…సినిమా రంగాన్నే పూర్తిగా నమ్ముకోకుండా…మంచి బిజినెస్ మ్యాన్ గా కూడా నాగ్ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నాడు….ఇక నిర్మాతగా నాగ్ సినిమా మొదలు పెడుతున్నాడు అంటే ఆ కధలో మంచి ఫీల్ ఉంటే గాని నాగ్ ఒప్పుకోడు అని ఆయన చేసిన కొన్ని ప్రయోగాత్మక చిత్రాలే సాక్ష్యాలు…ఇదిలా ఉంటే నాగ్ ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ సినిమాలో నటించిన విషయం తెలిసిందే…త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది….ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ్ అనేక టీవీ ఛానెల్స్ కు ఇంటర్‌వ్యూస్ ఇస్తున్నాడు….

అదే క్రమంలో వర్మ ట్వీట్స్ విషయంలో నాగ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు….అవేమిటో ఓక్ లుక్ వేద్దాం రండి…నాగార్జున వర్మల మధ్య సాన్నిహిత్యం గురించి కొత్తగా చెప్పవలసిన పని లేదు. వర్మ ‘శివ’ వల్ల తన కెరియర్ కు అద్భుతమైన మలుపు వచ్చింది అని నాగ్ చెపితే నాగార్జున వల్ల తనకు దర్శకుడిగా జన్మ లభించింది అని అనేక సందర్భాలలో వర్మ చెప్పాడు. అయితే వీళ్లిద్దరిలో ఎవరి వల్ల ఎవరికి ఎక్కువ మేలు జరిగింది అన్న విషయాన్ని పక్కకు పెడితే వీరిద్దరూ అత్యంత సన్నిహితులు అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే అదే క్రమంలో నాగార్జున ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ మాట్లాడుతూ వర్మ ట్విట్టర్లో తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పై నాగ్ స్పందిస్తూ వర్మ తనకేదనిపిస్తే అది మాట్లాడతాడని. వాటితో ఇబ్బంది ఉన్నవాళ్లు వర్మ ట్వీట్లను చదవడం మానేయవచ్చని నాగ్ సలహా ఇచ్చాడు. ఈ మధ్య వర్మ చేసిన వివాదాస్పద ట్వీట్లపై సెలబ్రెటీల నుంచి కూడా నెగెటివ్ కామెంట్లు వస్తున్న నేపధ్యంలో నాగార్జున మాత్రం వర్మకు బాసటగా నిలుస్తు ఈ కామెంట్స్ చేయడంతో వర్మకు టాలీవుడ్ లో మరొక పెద్ద సపోర్ట్ దొరికింది అని అనుకోవాలి. ఇక ఈ విషయం తెలిస్తే వర్మ ఊరికినే ఉంటాడా..మళ్ళీ ట్వీట్స్ యుద్దం మొదలుపెట్టినా పెడతాడు….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus