మల్టీస్టారర్స్ పై మక్కువ చూపుతున్న నాగార్జున

  • September 8, 2018 / 12:14 PM IST

కొత్తదనాన్ని, కొత్త తారాన్ని ఎంకరేజ్ చేయడంలో ముందుండే నాగార్జున మల్టీస్టారర్లను ఎంకరేజ్ చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ఆల్రెడీ మంచు విష్ణుతో ఒక మల్టీస్టారర్ సినిమా చేసిన “కృష్ణార్జున” పెద్దగా ఆడకపోయినా, కార్తీతో కలిసి నటించిన “ఊపిరి” చిత్రాలు మంచి విజయం సాధించి ఉండడంతో నాగార్జున ప్రస్తుతం తన కాన్సన్ ట్రేషన్ మొత్తం మల్టీస్టారర్స్ వైపు మళ్లించాడు. ఆల్రెడీ నానితో కలిసి ‘దేవదాస్” చిత్రంలో నటిస్తున్న నాగార్జున ఆ సినిమా విడుదలకు ముందే మరో మల్టీస్టారర్ ను అంగీకరించారు.

ధనుష్ హీరోగా తమిళంలో రూపొందనున్న ఓ చిత్రంలో నాగార్జున ముఖ్యపాత్ర పోషించనున్నారు. ధనుష్ సరసన అదితిరావు హైదరీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్న మొదలైంది. త్వరలోనే నాగార్జున చిత్రీకరణలో పాల్గొంటారు. నిజానికి నాగార్జున పోషించనున్న పాత్రను ధనుష్ తన మామ రజనీకాంత్ ను దృష్టిలో పెట్టుకొని రాసుకొన్నారు. కానీ.. రజనీ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో ఆ క్యారెక్టర్ ను నాగార్జునతో చేయిస్తున్నారు. నాగార్జున బాలీవుడ్ లోనూ “బ్రహ్మాస్త్ర” అనే చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. చూస్తుంటే నాగార్జున మెలమెల్లగా సౌత్ ఇండియన్ అమితాబ్ బచ్చన్ మాదిరిగా హీరోగా నటిస్తూనే ముఖ్యపాత్రలూ పోషిస్తాడని అర్ధమవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus